Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ : మహబూబాబాద్/బయ్యారం/సెప్టెంబర్2/అక్షరం న్యూస్... ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బయ్యారం మండలలోని ఏజెన్సీ ప్రాంతాలైన అల్లిగూడెం, కంబాలపల్లి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క మరియు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్,ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య సందర్శించారు.ఈ సందర్భంగా సీతక్క మరియు బలరాం నాయక్, కనకయ్య లు మాట్లాడుతూ,గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని, తక్షణ సహాయం వెంటనే అందిస్తామని, జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడం జరుగుతుందని వారు తెలిపారు.అలాగే బ్రిడ్జిలో నిలిచిపోయిన చెత్త చేదరాన్ని వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు ఆదేశాల జారీ చేశారు. పర్యటనలో పిఏసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి,జిల్లా పార్టీ కార్యదర్శి ప్రవీణ్ నాయక్, వీరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, సీతారాం రెడ్డి, మాజీ ఎంపీటీసీలు శైలజ రెడ్డి, సోమేష్, లక్ష్మి గణేష్, మోహన్ జీ, మంగీలాల్, మాజీ సర్పంచ్ లు వెంకటేశ్వర్లు, ప్రసాద్, రమేష్, వెంకటపతి, తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily