Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /సెప్టెంబర్ 4/అక్షరం న్యూస్... గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వలన రైతాంగం కుదేలై పోయిందని,లక్షలాది ఎకరాలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని దీనికి ప్రభుత్వం నిర్వహించిన నష్టపరిహారం సరిపోదని ఎకరం నష్టపోయిన మిర్చికి 30 వేల రూపాయలు,పత్తి, వరికి 25000 ఇవ్వాలని ఏఐకేఎమ్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ అన్నారు. చనిపోయిన పాడిపశువులకు 75 వేలు,మేకలు గొర్రెలకు పదివేల చొప్పున ఇవ్వాలని అన్నారు.రాష్ట్రంలో 31 మంది చనిపోయారని వీరికి ఎక్స్గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలని అన్నారు. గార్ల మండలంలో భారీ వర్షం వలన నష్టపోయిన పంటలను ఏఐకేఎంఎస్ బృందం పరిశీలన చేసింది.అనంతరం ముత్తి తండలో ఇస్లావత్ రాందాస్ ఎకరం మిర్చి పంట వర్షం కారణంగా నష్టపోయిందని,మొక్క కు 90 పైసలు చొప్పున 16 వేల మొక్కలు వేశారని,పేపర్ ఖర్చు 12,000 కూలీలకు 30 వేలు,డిఏపి కట్టలకు 5600 ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. మండలంలో అనేక గ్రామాల్లో వరి, పత్తి,మిర్చి పంటలు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి గ్రామాల కు వెళ్లి నష్టపోయినటువంటి పంటను అంచనా వేసి పరిహారం ఇవ్వాలని జడ సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కమల, బావుసింగ్,భద్రు,శంకర్,బిచ్చ, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily