Sunday, 08 September 2024 08:13:15 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముసురు వాతావరణం

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 20 July 2024 01:49 PM Views : 1834

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -19(అక్షరం న్యూస్ ) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ముసురేసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం కూడా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ సీజన్‌లో ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే కావడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రానున్న రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఉదయం నుంచి వర్షపు జల్లులు కురిశాయి. ఉదయం నుంచి దఫ దఫాలుగా వాన కురిసింది. కొన్ని మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసి పొలాల్లో నీరు చేరుతుండడంతో రైతులు పొలం పనులకు సన్నద్ధమవుతున్నారు.ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంలో అనేక మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. కొన్ని వ్యాపార సంస్థలను కూడా తెరవకపోవడంతో వాటికి సంబంధించిన సిబ్బంది ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైన వారు తప్ప ఎవరూ ప్రయాణించేందుకు ఆసక్తి చూపలేదు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారిలో చాలామంది తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు రానున్న రెండు,మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవ కాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ అవసర మైన రక్షణ చర్యలు చేపట్టాల న్నారు. విద్యుత్‌ స్తంభాలు, భారీ వృక్షాలు పడిపోవడం, రహదారు లు, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బం దులు ఏర్పడడం, ఇతరతా సమస్యలపై ఉన్న తాధికారుల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలని సూచించారు మరో వైపు జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన జాగ్రత్తలు, ఏర్పాట్లు ముందస్తుగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అధికారులను ఆదేశించారు.వర్షాల దృష్ట్యా 24 గంటలు, పెట్రో, బ్లూ కల్ట్స్ సిబ్బందితో గస్తీ నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని, వాగులు, చెరువులు, అలుగుల వద్దకు పిల్లలను, చేపల వేటకు వెళ్లనివ్వకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. విద్యుత్ స్థంబాలు, తడిసిన గోడలు, ఇంటి కప్పు రేకులకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.గ్రామాల్లో, పట్టణాలలోని ప్రజలు గుడిసెలు, శిథిలావస్థలో ఉన్న పాత ఇండ్లలో ఉన్న నివాసస్థులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు తగ్గేవరకు మరోచోట ఉంటే క్షేమమని తెలిపారు. అత్యవసర సమయాలలో 100 కు సమాచారం అందిస్తే తక్షణ సహాయక రక్షణ చర్యలను చేపడతామని ఎస్పీ తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :