Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -21(అక్షరం న్యూస్ ) 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా రుపొందించాలని తహసీల్దార్ సురేష్, స్పెషల్ సమ్మరి రివిజన్ శిక్షకులు తెలియజేసారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో మండల బీ ఎల్ ఓ లతో సమావేశం ఏర్పటు చేశారు బీ .యల్.ఓ.లకు ఓటర్ లిస్ట్, ఫారం 6,7,8లు ఇవ్వాలని వాటిని ఎలా పూరించాలి, వాటికీ ఎ డాక్యుమెంట్ కావాలో తెలియపర్చారు అలాగే ఫారం 6 ద్వారా కొత్త ఓటర్ల వయస్సు జాగ్రత్తగా పరిశీలించాలని, ఫారం 7 ద్వారా తొలగింపులైన మరణించిన వారి వివరాలు, శాశ్వత నివాస మార్పులు, ఫారం 8 ద్వారా మార్పులు చేర్పులు చేపించాలన్నారు.దరఖాస్తులని క్షేత్ర స్థాయి లో పరిశీలించాలని తిరస్కరణకు గురైన దరఖాస్తుల కారణాలను తెలియపర్చాలని, ప్రతి ధరఖాస్తు పై బి.యల్.ఓ, ఎ.ఈ.ఆర్.ఓ, ఈ.ఆర్.ఓ. ల సంతకాలు ఖచ్చితంగా ఉండాలని సూచించారు. ఓటర్ జాబితాలో అవసరమైన చోట పాత ఫోటోలు తొలగించి ఓటల్ రా నూతన ఫోటోలు అప్లోడ్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమం లో తహసీల్దార్ .బూత్ లెవల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily