Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెంజిల్లా/కొత్తగూడెం/సెప్టెంబర్ 16/అక్షరం న్యూస్ : అధ్యయనం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఏచూరి సంతాప కార్యక్రమాన్ని మంచికంటి భవన్ లో ఆదివారం నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి ముందుగా సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ ఏజె రమేష్ అధ్యక్షతన జరిగిన సభలో మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కామ్రేడ్ ఏచూరి నిరంతరం అధ్యయనం చేస్తూ సమాజ పరిణామక్రమాన్ని భౌతిక పరిస్థితులకు అనుగుణంగా అంచనా వేసి పోరాటాలకు శ్రీకారం ఎలా చుట్టాలి అనేది రూపకల్పన చేసి నూతన సమాజ నిర్మాణం కోసం కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. విద్యార్థి దశ నుంచే అధ్యయనంపై మక్కువ పెరిగి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో భారతదేశానికి దిక్సూచిగా ఉండాలి అని అకుంఠిత దీక్షతో భారత దేశ నిర్మాణంలో విద్యార్థులకు కీలకపాత్ర పోషించాలని సమ సమాజ స్థాపనకై విద్యానభ్యసిస్తూనే, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తలచి తోటి విద్యార్థులతో చర్చగోస్టులు చేసి ప్రపంచ మేధావులు రచించిన పుస్తకాలను అధ్యయనం చేసి తోటి విద్యార్థులకు వివరించేవారని, తను నిత్యం ఆచరిస్తూ కమ్యూనిజం సిద్ధాంతాన్ని అపోసన పట్టుకొని భావితరాలకు మార్గదర్శకం అయ్యరాన్నారు . మన భారతదేశంలో ఉన్న ప్రముఖులే కాక ప్రపంచంలో ఉన్న మేధావులు సైతం గర్వించదగ్గ గొప్ప సైబంతిక వేత్త అని అన్నారు. రాజకీయాలలో ప్రవేశం చేసి అంచలంచలుగా పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన సమయంలో బూర్జువా పార్టీలతో వస్తున్న అనేక సైద్ధాంతిక సమస్యలపై అవగాహన కలిగి ఉండే వారన్నారు. దేశం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న సమయంలో.. ఒకవైపు మతోన్మాద భావాలు కలిగిన రాజకీయాలు మరోవైపు అన్ని వర్గాలపై భారాలు మోపే పాలకవర్గ విధానాలపై సమానంగా పోరాటాలు నిర్వహిస్తూ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీలు సరైన మార్గంలో నడిచే విధంగా ఆలోచనలు చేయడంలో దిట్టగా ఆయన నిలిచారనీ అన్నారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా ప్రతి సమస్యపై నిరంతరం అధ్యయనం చేసి స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్లేలా ఆలోచన చేసేవారని ఆయన అన్నారు. ఉన్నత సామాజిక వర్గ కుటుంబంలో పుట్టినా కూడా తన ఆలోచనలు, ఆచరణ అన్ని వర్గాల ప్రజల కోసం అహర్నిశలు ప్రజల కోసం శ్రమించిన మహా నాయకుడు కామ్రేడ్ ఏచూరి అని అన్నారు. అధ్యయనం పోరాటం నినాదాన్ని ఉనికిపుచ్చుకొని కడవరకు పోరాటాలు చేసే ఎర్రజెండా ను వదలకుండా చివరి కంటూ జనం కోసం పాటుపడిన ఒక మేధావిని ప్రపంచం కోల్పోయిందని ఆయన అన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కలలుకున్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని ప్రతి సమస్యపై అధ్యయనం చేస్తూ భౌతిక పరిస్థితులు అంచనావేసి నిరంతరం జనం కోసం పాటుపడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే బ్రహ్మచారి జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ భూక్య రమేష్ స్టడీ సర్కిల్ సభ్యులు కే సత్య , నందిపాటి రమేష్, ఉపేష్, రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు
-
Aksharam Telugu Daily