Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు,వంకలు,చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారు సూచించారు.సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు మరియు చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేసారు.వరదల్లో చిక్కుకుని ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో ఉండేవిధంగా డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు.ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు వారి సేవలను పొందాలని కోరారు.ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
-
Aksharam Telugu Daily