Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -10(అక్షరం న్యూస్ ) బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం సేవిస్తే అటువంటి వారిపై పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు తప్పవని ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ హెచ్చరించారు. శనివారం మండలంలో ఉన్న టీ షాపులను ఆన్నిటిలో ఉన్న ,సిట్టింగ్ ప్రదేశాలను తనిఖీ చేశారు. కొందరు టీ షాప్ వారు తమ ఆవరణలో సిగరెట్ తాగేందుకు అనుమతిస్తున్నారని గుర్తించి.. ఆవరణలో ధూమపానం చేయొద్దని టీ షాపు నిర్వాహకులకు సూచించారు. టీ షాపుల వద్ద కొందరు విద్యార్థులు, మైనర్లు సిగరెట్ తాగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందిఅని , టీ షాపుల్లో ఎవరినీ పొగతాగనివ్వరాదని హెచ్చరించారు . బహిరంగంగా ధూమపానం చేస్తే జరిమానా.. విధిస్తామన్నారు తనిఖీ లో రెండు పబ్లిక్ స్మోకింగ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు .. టీ షాపుల్లోని దుమ పానం కోసం ఏర్పటు చేసిన క్యాబిన్ తరహా గదులను తొలగించారు,18 ఏళ్ల లోపు వారికి పొగాకు వస్తువులను అమ్మరాదని సూచించారు. వీరితో పోలీస్ సిబ్బంది ఉన్నారు
.
Aksharam Telugu Daily