Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం : - భద్రాద్రి కొత్తగూడెం, కరకాగూడెం, సెప్టెంబర్05(అక్షరంన్యూస్):గుట్టల్లో తుపాకుల మోత తెల్ల తెల్ల వాడుతున్న సమయంలో బాంబుల శబ్దం తో దద్దరిల్లిన కరకాగూడెం పరిసర ప్రాంతాలు.ఎం జరుగుతుందో అర్ధం కాక భయబ్రాంతులకు గురైన మన్యం ప్రజలు. రఘునాధపాలెం జెండాగుట్ట ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీస్ బలగాలతో తెల్లవారుజామున ఎదురు కాల్పులు ఇరువర్గాల మధ్య జరిగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్నతో సహా దళ సభ్యులు ఆరుగురు మృతి చెందారు, పోలీసుల లో ఇద్దరు గ్రేహౌండ్స్ కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండాల దామరతోగు, కరకగూడెం మండలాల్లో చత్తీస్గడ్ నుంచి వలస వచ్చిన మావోయిస్టు పార్టీకి చెందిన మణుగూరు ఏరియా కమిటీ కార్యదర్శి లచ్చన్న నాయకత్వంలో లచ్చన్న దళం ఈ ప్రాంతాలలో సంచరిస్తున్న విషయాన్ని విశ్వసనీయ సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేస్తుండగా ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం.
.
Aksharam Telugu Daily