Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ సెప్టెంబర్ 3 (అక్షరంన్యూస్) ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఉన్న పంపింగ్ వెల్ రోడ్, రామన్న పేట, జలగం నగర్ , ధంసలాపురం , అగ్రహారం కాలనీ పద్మావతి నగర్ , మోతి నగర్ , బొక్కల గడ్డ , వెంకటేశ్వర నగర్ ప్రాంతాలలో నివసించే ప్రజలు వరదల్లో చిక్కుకొని పలు కష్టాలతో ఇబ్బంది పడుతున్న వారికి తమ వంతు సహాయంగా పల్లా కిరణ్ కుమార్ అద్వర్యంలో ఆహార పొట్లాలు, నీళ్ల బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణి చేశారు . ధైర్యం కోల్పోయిన వారికి మనోధైర్యాన్ని నింపి ఆసరాగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరూ తోటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానవసేవే మాధవసేవ అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు ఉన్నారు.
.
Aksharam Telugu Daily