Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : డిగ్రీ నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఈ నెల 14, 15 తేదీల్లో ఉచిత వక్త శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు స్టెప్ ప్రిన్సిపాల్, తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థుల్లో ఆవరించిన ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి, తద్వారా వారు అనుకున్న లక్ష్యాలకు చేర్చడానికి ఈ వక్తా శిక్షణా తరగతులు ఎంతో ఉపయుక్తం కాగలవని ఆయన తెలిపారు. కాగా ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనే విద్యార్థిని,విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి లతోపాటు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. తరగతులు గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, నెక్కల్లు గ్రామంలో ఉన్న రంగారావు - సావిత్రమ్మ ధ్యాన కేంద్రంలో జరుగుతాయని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హౌ టు ఓవర్ కమ్ స్టేజి ఫియర్, కంటెంట్ ప్రిపరేషన్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మోడ్యులేషన్, గోల్ సెట్టింగ్, ఫస్ట్ స్పీచ్ ప్రిపరేషన్, నవరసాలు, ఎథిక్స్ ఆఫ్ స్పీకర్ అనే అంశాలను "స్టెప్" (స్టూడెంట్స్ టీచర్స్ ఎడ్యుకేటర్స్ పేరెంట్స్) నిర్వాహకులు, ప్రముఖ సైకాలజిస్ట్, డాక్టర్. ప్రత్యూష సుబ్బారావు, ప్రముఖ ప్రొఫెసర్ అరవింద్ తదితరులు బోధిస్తారని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు 9963188715, 8367073223 నెంబర్లకు ఫోన్ చేసి, పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి
-
Aksharam Telugu Daily