Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్ /దమ్మాయిగూడ : ... మహబూబాబాద్ /గార్ల /ఆగష్టు1/అక్షరం న్యూస్. బయ్యారం మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సోమవరపు రవి మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచలు పేల్చి, స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు చేశారు. అనంతరం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు నెమలి బిక్షపతి మాదిగ,గంట శ్రీనివాస్ మాదిగ,పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ బైండ్ల ,పోతురాజు రాజశేఖర్ మాదిగ మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 ఏళ్లు సుదీర్ఘమైనటువంటి శాంతియుత పోరాటానికి భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయం చేసిందని మాదిగ,మాదిగ ఉపకులాలకు చెందిన 59 కులాలకు ఎస్సీ రిజర్వేషన్ సమపాళ్లల్లో అంది అన్ని వర్గాల అభివృద్ధి చెందుతాయని ఎలాంటి తారతామ్యం లేకుండా మాదిగ, మాదిగ ఉపకులాలు 59 తెగలవారు హర్షం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. అంతేకాదు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.ఈ పోరాటంలో చాలా మంది అసువులు బాశారని,వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు ఎన్నో కుట్రలు చేశారని అయినా మొక్కవోని ధైర్యంతో ఏమాత్రం సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించమని, న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలబడిన వారందరికీ ఈ విజయం అంకితమని తెలిపారు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఎస్సీ వర్గీకరణ తీర్పును ఆహ్వానిస్తున్నామని,దేశంలో అందరికంటే ముందు ఏ,బీ, సీ, డీ వర్గీకరణ తెలంగాణలో అమలు చేస్తామని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామని స్పష్టం చేసినందుకు యావత్ తెలంగాణ మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సంగేపొంగు శ్రీనివాస్ మాదిగ, మందుల గణేష్ మాదిగ,తుడుం రాజేష్ మాదిగ,మబ్బు ప్రశాంత్ మాదిగ,పోతురాజు అలెగ్జాండర్ మాదిగ,మరికంటి నరేష్ మాదిగ,కోట సుధాకంత్ మాదిగ, బైగళ్ల వీరబాబు మాదిగ, కొండ వెంకటేశ్వర్లు మాదిగ, సహదేవులు మాదిగ,మట్టె భద్రమ్మ మాదిగ, మట్టే పద్మ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily