Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఆపదలో ఉన్న వారికి సాయం చేసే గుణం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలతో కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది రోగులకు పాల్వంచ బాపూజీ నగర్ కు చెందిన యేసు కరుణ సువార్త మందిరం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బ్రెడ్, పండ్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవర్చుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రోగులు సహకారం అందించడం పట్ల అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. సేవా తత్పరత ప్రేమ కరుణ తోటివారిపట్ల సహాయ గుణం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ సాబీర్ పాషా, వార్డు కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య ధర్మరాజు యూసఫ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ప్రభుదాస్, అడవికట్ల సురేష్, కొండ్లె రవి, పాస్టర్ సురేష్, కిరణ్, ఆర్.సంజీవ్ కుమార్, విజయ్, కాటయ్య మధు, శ్రీను , బబ్లు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు
-
Aksharam Telugu Daily