Sunday, 08 September 2024 08:19:43 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

ముదిరాజ్ లను రాజకీయంగా, ఆర్ధికంగా ఆదుకోవాలి...

చట్టసభలలో, స్థానిక సంస్థలలో ముదిరాజు లకు కనీసం 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి... ముదిరాజులకు మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేయాలి... ముదిరాజ్ యువతను ప్రభుత్వం ఆదుకోవాలి... గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు...


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 25 July 2024 06:11 PM Views : 262

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /జులై 25/అక్షరం న్యూస్... రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న ముదిరాజులు బీసీడీలో ఉండటం వలన నిరాదరణకు గురవుతున్నారని, విద్యా ఉద్యోగ అవకాశాలు లేక ఆటో డ్రైవర్లుగా,తాపీ మేస్త్రిలుగా మారి జీవనం కొనసాగిస్తున్నారని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా,గార్ల మండల కేంద్రంలో బీసీ డి నుండి ఏ కు మార్చాలని ఎన్నికల ముందు అభయ హస్తం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేయాలని కోరుతూ భారీ ర్యాలీ అనంతరం, తహసిల్దార్ రవీందర్ కు వినతి పత్రం సమర్పించారు.అనంతరం గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ, దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ సౌకర్యాలకు దూరమై ఆర్థికంగా నష్టము జరిగి ఇబ్బందులకు గురవుతున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య కలిగిన జనాభా ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉన్నామని వాపోయారు. మా జనాభాలో కొంతమంది మత్స్యకార వృత్తి, తోటల పెంపకం ఇతర వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇతర వృత్తులపై ఉండి అత్యంత పేదరికంలో దుర్భారమైన పరిస్థితులలో తమ జీవనాన్ని కొనసాగిస్తూ సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నామన్నారు. ముదిరాజులను రాజకీయంగా, ఆర్ధికంగా ఆదుకోవాలని, మత్స్యకార సంఘాలు ఏర్పాటు చేయాలనీ, చట్టసభ లలో, స్థానిక సంస్థలలో ముదిరాజు కులస్తులకు కనీసం యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు మారబోయిన రాంబద్రం ముదిరాజ్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘము చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్ ముదిరాజ్, హాజరుకాగా గార్ల మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పందుల నారాయణ అధ్యక్షత వహించారు. గార్ల మాజీ జడ్పిటిసి ఎద్దు లక్ష్మణ్ ముదిరాజ్, చెన్నబోయిన ఆంజనేయులు ముదిరాజ్, సాదు రాములు ముదిరాజ్, పందుల రాకేష్ ముదిరాజు, గుండ్లపళ్లి సతీష్ ముదిరాజ్, అయితపోయిన ఉపేందర్ ముదిరాజ్, నాయిని బిక్షమయ్య ముదిరాజ్, సమవర్తి చంద్రశేఖర్ ముదిరాజ్, ఎద్దు రాము ముదిరాజ్, అలువాల సంపత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :