Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /సెప్టెంబర్ -01(అక్షరం న్యూస్ ) మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించిందిఅని ముస్తాబాద్ తహసీల్దార్ ఆర్, సురేష్ తెలిపారు ఇన్నాళ్లుగా తహసీల్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందుస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినట్లు వారు తెలిపారు కొత్తగా.. గ్యాప్ సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, మైనార్టీ సర్టిఫికెట్, మరోసారి సర్టిఫికెట్ల జారీ (రీ ఇష్యూ), క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లు, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, పాత రికార్డుల కాపీలు (ఖాస్రా/సెస్సాలా పహాణీ), 1బీ సర్టిఫైడ్ కాపీలు ఆన్‌లైన్‌లో మీ సేవ ద్వారా అందజేయనున్నారని తెలిపారు. మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు
.
Aksharam Telugu Daily