Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -15(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలం పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు ప్రోత్సాహంతో వెన్నమనేని శ్రీనివాసరావు (888) కూతురు విన్నమనేని హన్సిక తన తండ్రి పుట్టినరోజు జన్మదినం సెప్టెంబర్ 22నా జరగనున్న సందర్బంగా రు.150000 వేల రూపాయల చెక్కు ను వితరణ చేశారు. ఈ చెక్కు ద్వారా వచ్చిన డబ్బును రెండు సంవత్సరాలపాటు పాఠశాలలో కంప్యూటర్ బోధకుడి జీతం కొరకు వితరణ చేసారని తెలిపారు తాజా మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు చేతుల మీదుగా చెక్కును ప్రధానోపాధ్యాయులు సురభి రాధా కిషన్ రావు కు అందచేశారు . ఈ సందర్భంగా పాఠశాల యజమాన్యం, పోతుగల్ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పోతుగల్ మాజీ సర్పంచ్. గౌతమ్ రావు హైదరాబాదులో ఉన్న పోతుగల్ స్వీట్ షాప్ నుండి రు 5000వేల రూపాయల తీపి మిఠాయి లు తీసుకచ్చి స్వయoగా పిల్లలకు అందచేసారు , అక్కరాజు శ్రీనివాస్ , కొండని బాలకిషన్ , జంగారాజు , కావటి మహిపాల్ , కోలా కృష్ణ , తోట ధర్మేందర్ లు హన్సికను అభినందించారు.రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్,.తాజా మాజీ ఎంపీటీసీ కొండని బాలకిషన్, వార్డు సభ్యుడు మహిపాల్, రాజు,మాధవరావు లను ,దాతలైన బత్తిని శుభోద్,రిటైర్డ్ టీచర్ భగవాన్ రెడ్డి, పాక శంకర్లను సన్మానించారు . ఉపాధ్యాయులు,గ్రామస్తులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily