Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల పెద్దపల్లి /సెప్టెంబర్ -01(అక్షరం న్యూస్ ) గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొత్కపల్లి ఎస్ఐ జి అశోక్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అవసరమైతేనే తప్ప బయటకి రాకూడదని అదేవిధంగా గూడెం దగ్గర నక్కల వాగు మరియు మానేరు పరివాహక గ్రామాలు గుండ్ల పల్లె మడక కనగర్తి పొత్కపల్లి రూప్ నారాయణపేట ఇందుర్తి గుంపుల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకూడదని అదేవిధంగా పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అదేవిధంగా గ్రామాలలో శిథిలవస్థలో ఉన్న ఇళ్లల్లో ఎవరు నివాసం ఉండరాదు అన్నారు మానేరు పరివాహక. ప్రాంతాల్లో నీటిలోకి ఎవరు వెళ్లొద్దని తెలిపారు. మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు షార్ట్ సర్క్యూట్ వచ్చే అవకాశం ఉన్నందున వాటికి దగ్గరగా మనుషులు వెళ్లొద్దని, పశువులను కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే స్థానిక పోలీస్ స్టేషన్ కు, అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేస్తే సహాయాన్ని అందిస్తారని,పోలీసులకి సహకరించాలన్నారు. చెరువులకు, కుంటలకు దూరంగా ఉండాలని తెలిపారు కరెంటు మోటార్ల కాడికి పోయే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ప్రమాదం సంభవిస్తే హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు అదేవిధంగా తడిసిన చేతులతో ఇళ్లల్లో స్విచ్ బోర్డులు ముట్టుకో రాదని విద్యుత్ స్తంభాలను తాకరాదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు
.
Aksharam Telugu Daily