Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, వరదలకు నిర్వాసితులుగా మారుతున్న ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో, పునరావాస ఏర్పాట్లలో ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది అలసత్వం వహించొద్దని, అప్రమత్తతతోనే జరిగే నష్టాన్ని నివారించవచ్చని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లిన అయన అక్కడినుంచి జిల్లా ఉన్నతాధికారులతో ముంపు సమస్యపై పలు సూచనలు చేశారు. పొలిసు, రెవిన్యూ, విద్యుత్, మున్సిపల్, వైద్య, పంచాయతిరాజ్ శాఖల జిల్లా అధికారులతోపాటు నియోజకవర్గ పరిధిలోని మండలస్థాయి అధికారులతో మాట్లాడారు. ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలని, సకాలంలో స్పందించి తగిన చర్యలు చేపడితేనే జరిగే నష్టాన్ని నివారించవచ్చని సూచించారు. పొలిసు, విద్యుత్, వైద్య శాఖా, మున్సిపల్, పంచాయతి రాజ్ శాఖలు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ చర్యలు తీసుకోవాలని, విద్యుత్ పునరుద్దరణకు ఆ శాఖా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వాసితులుగా మరిన్ని కుటుంబాలని పునరావాస కేంద్రాలకు తరలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలనీ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరిస్థితిని అదులుపుకు తీసుకోవడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు.
-
Aksharam Telugu Daily