Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహబూబాబాద్ /గార్ల /ఆగష్టు12/అక్షరం న్యూస్... గార్ల పోలీస్ స్టేషన్ లో ఎస్సై జీనత్ కుమార్ ఆద్వర్యంలో సమావేశం నిర్వహించి,పరిమితులపై అవగాహన కల్పించిన ప్రభుత్వ వైద్య నోడల్ అధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్.ఆర్.ఎం.పి,పి.ఎం.పి లతో సమావేశమై గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స చేస్తున్న ఆర్ ఏం పి / పి ఏం పి పరిమితికి మించిన వైద్యం చేస్తున్నారని, దానివల్ల ప్రజలు వివిధ రకములుగా అనారోగ్యం పాలగుట , కొన్ని చోట్ల పరిస్థితులు విషమించి ప్రాణాలు కోల్పోయినట్లుగా ఆరోపణలు రావటంతో మహబూబాబాద్ జిల్లా, గార్ల మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై జీనత్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రభుత్వ నోడల్ వైద్య అధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాధవ్, మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాలలో ప్రథమ చికిత్స చేస్తున్న ఆర్ ఏం పి,పి ఏం పి లు ల్యాబ్ , ఎక్స్ రే , పార్మసి నిర్వాహకులతో పరిమితులపై అవగాహన కల్పించారు.సమావేశంలో ఎస్సై జీనత్ కుమార్ మరియు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ,గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో నిత్యం అందుబాటులొ ఉంటు ప్రథమ చికిత్స అందిస్తున్న వారిని అభినందించారు . కానీ కొందరి పరిమితికి మించిన వైద్యం అందించడం వల్ల ప్రజలకు ఆరోగ్య తలెత్తుతున్నాయన్నారు. అలా ఏవరు పరిమితికి మించిన వైద్యం అందించకూడదని, అమాయక ప్రజల ఆరోగ్యాలతో ఏవరు ఆడుకోకుడదని అన్నారు.ప్రథమ చికిత్స కేంద్రాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను ద్రుష్టి ఉంచుకుని ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. చికిత్స కేంద్రం బోర్డుపై కేవలం "ప్రథమ చికిత్స కేంద్రం" లేదా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అని వ్రాయాలన్నారు. పేరుకు ముందు డాక్టర్ అని వ్రాసుకోకూడదని అన్నారు. స్వయంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుట, ఇంజక్షన్ లు వేయుట,ఐవి స్టాండ్ లు, మందుల చిట్టిలు ఇచ్చుట , సెలైన్ బాటిల్స్ ఏక్కించుట, ఇన్ పేషెంట్ బెడ్ నిర్వహించుట వంటివి చేయకూడదని అన్నారు . రోగులకు ఇన్ పేషెంట్ వైద్యం, ల్యాబ్ (రక్త మూత్ర పరీక్షల) నిర్వాహణ చేయకూడదని సూచించారు . రోగులకు హై డోస్ అంటిబయేటిక్స్ , స్టీరాయిడ్స్, నొప్పికి సంబంధించిన మందులు వాడటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. రక్త, మూత్ర పరీక్షలు, లింగ నిర్ధారణ, అబార్షన్లు చేయుట,డెలివరీలు, కాన్పూలు నిర్వహించుట వంటివి చేయకూడదని అన్నారు .రోగులను ప్రలోభపరిచి అనవసరంగా కార్పోరేట్ ఆసుపత్రులకు సిఫార్స్ చేయకుడదన్నారు . గర్భిణి స్త్రీలకు సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని సూచించారు . అందరు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఉన్నత వైద్య అధికారుల అకస్మి తనిఖీల సమయంలో పరిమితులు ఉల్లంఘించిన వారిపై క్లినికల్ ఏస్టబ్లీష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రేగ్యూలేషన్ యాక్ట్ 2010/11 ప్రకారం చట్టపరమైన చర్య తీసుకుంటారని సూచించారు . కావున ఏవరు నిబంధనలు ఉల్లంఘించకుండా ఆరోగ్య తెలంగాణ మరియూ ఆరోగ్య భారతావనికై సహకరించాలన్నారు.
.
Aksharam Telugu Daily