Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గణేశ్ నవరాత్రులు ముగించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం వద్ద గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం తెలియజేసారు. నిమజ్జనం జరిగే ప్రదేశాలను జిల్లా ఎస్పీ సందర్శించారు. నిమజ్జన సమయంలో ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు వారి సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేయనున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. ముఖ్యంగా ఉత్సవ కమిటీ సభ్యులు బాధ్యతగా నియమ నిబంధనలను పాటిస్తూ పోలీసు వారి సూచనలను పాటించాలని కోరారు.చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మొత్తం 1537 విగ్రహాలతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మొత్తంలో భద్రాచలానికి నిమజ్జనానికి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
-
Aksharam Telugu Daily