Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు జిల్లా షీ టీం ఎస్సై రమాదేవి శనివారం ప్రియదర్శిని డిగ్రీ కాలేజీ, సింగరేణి ఉమెన్స్ కాలేజీలో మహిళల లపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలపై లైంగిక వేధింపులు, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బ్లాక్మెయిలింగ్ ఇతర ఇబ్బందులు ఎదురుకున్నప్పుడు మహిళలు జిల్లా షీ టీమ్స్ ను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. జిల్లా షీ టీమ్స్ ఫోన్ నంబరు 8712682131 కి ఫోన్ చేసి తమ సమస్యని తెలియజేసుకోవచ్చని అన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గొప్యంగా ఉంచబడతాయని అన్నారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే నేరస్తుడిని షీ టీం కార్యాలయానికి కి పిలిచి వారి తల్లీదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పరిస్థితిని బట్టి నిందితుడిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.బాలికలకు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిర్భయంగా షీ టీమ్ ను సంప్రదించవచ్చని తెలి పారు. ఈ ప్రోగ్రామ్ లో షీ టీం ఎస్సై రమాదేవి,షీ టీం కానిస్టేబుల్ నాగయ్య, కాలేజీ సిబ్బంది తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
-
Aksharam Telugu Daily