Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/తల్లాడ జూలై 22 (అక్షరంన్యూస్)* *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని అమలు చేసిన జీవోను సవరించి, అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా తల్లాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషన్ కార్డు ఉన్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని నిబంధనలు పెట్టటం సరైనది కాదన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికే తెల్ల రేషన్ కార్డు అని ప్రతిపాదన చేస్తున్నప్పటికీ జీవోలో మాత్రం రేషన్ కార్డు ఉన్న వారికే అమలయ్యే విధంగా చేశారని గుర్తుచేశారు. వెంటనే ఆ జీవోలను మార్చాలన్నారు. జిల్లాలో ఐదు లక్షల మందికి పైగా రైతులు ఉంటే లక్షల లోపు 57, 375 మందికి వచ్చిందని, ఆ లెక్కన చూసుకుంటే సుమారు 3 లక్షల మందికి రావాల్సి ఉందన్నారు. తల్లాడలో 2500 మంది ఉంటే 300 మందికి, కుర్నవల్లిలో 1179 ఉంటే 307 మందికే రుణమాఫీ వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా రుణమాఫీ చేశామని ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. రేషన్ కార్డుతో ముడి పెట్టకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఇవ్వాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ రైతులతో కలిసి ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ శీలం సత్యనారాయణ రెడ్డి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్, రైతు సంఘం నాయకులు అయినాల రామలింగేశ్వరరావు, రైతు సంఘం తల్లాడ మండల కన్వీనర్ నల్లమోతు మోహన్ రావు, చల్లా నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.*
.
Aksharam Telugu Daily