Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లాకు నాలుగు రోజుల పాటు భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. ఇందుకోసం ఐడిఓసి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ తో పాటు 24 గంటలు పర్యవేక్షణ నిమిత్తం సిబ్బందిని విధులు కేటాయించారు. కలెక్టరేట్ కార్యాలయంలో 08744-241950 నెంబర్ అందుబాటులో ఉంటుందని, నిరంతరం సమాచార నిమిత్తం 18 మంది సిబ్బందిని కేటాయించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సిబ్బంది శనివారం సాయంత్రం నుంచి నాలుగో తేదీ సాయంత్రం వరకు నిరంతరం అందుబాటులో సేవలందిస్తారని తెలిపారు...
-
Aksharam Telugu Daily