Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వికారాబాద్ : వికారాబాద్ జిల్లా/మర్పల్లి/జూలై 27/అక్షరంన్యూస్ :- మర్పల్లి మండల పరిధిలోని మర్పల్లి సమీపంలో శుక్రవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలను తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా మర్పల్లి ఎస్ ఐ మాట్లాడుతూ వాహనాలను ధృవపత్రాలతో పాటు లైసెన్స్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అంతేకాకుండా తలకు హెల్మెట్ ధరించాలని ఆయన వాహనాదారులకు సూచించారు. మర్పల్లి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకున్నా పెనాల్టీ తప్పదన్నారు . ఎస్సై సురేష్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily