Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : /లక్ష్మి దేవిపల్లి లక్ష్మీదేవిపల్లి మండల గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్ లైన్ లో పర్మిషన్ తీసుకోవాలని లక్ష్మిదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన లక్ష్మిదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం, నిమజ్జనం తేదీ, ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ పూర్తి వివరాలను నమోదు చేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అదే విధంగా విద్యుత్ శాఖ అనుమతితో మండపాల నిర్వాహకుల ఫోన్ నెంబర్లతో ఫ్లెక్సీ ఏర్పాటు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు చేసుకునేందుకు ప్రభుత్వం సింగిల్ విండో విధానం అమలులోకి తెచ్చిందన్నారు. అనుమతులు పొందిన తరువాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటుచేయాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
Aksharam Telugu Daily