Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /సెప్టెంబర్ -09(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండల కేంద్రం లోని పెద్ద చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు నిండి అలుగు దుంకుతుండడంతో.ముస్తాబాద్ శివ కేశవ ఆలయ చేర్మెన్ ఎల్సాని దేవయ్య. వారి కుటుంబం, పాలక వర్గం. నిండిన చెరువు నుండి గంగ నీరు తీసుకవచ్చి శివ లింగానికి జాలాభిషేకం చేశారు అనంతరం ఒగ్గు పూజారులతో. శివాలయం నుండి పెద్ద చెరువు వరకు ఒగ్గుడోలు చప్పుళ్లతో. నృత్యల తో నడుచుకుంటూ చేరుకున్నారు.. చెరువు కట్టపై గంగ పట్నం, వేసి గంగమ్మ కు చీరే సరెలు సమర్పించారు గంగమ్మ తల్లి గ్రామ ప్రజలందరికీ ఆయు ఆరోగ్యాలు ,అష్ట ఐశ్వర్యాలు అందజేయాలని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా, చల్లగా చూడాలని, ప్రజలకు అమ్మవారు దీవెనలు నిండుగా ఉండాలని అమ్మవారిని వరినట్లు ఎల్సాని దేవయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,దొరగోల్ల బాలయ్య, తాళ్ల రాజు, చెవుల మల్లేశం, జలా బిక్షపతి,బండారి సత్తయ్య, తుమ్మ రాజేందర్, కంచం మంజుల నర్సింలు, ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నర్సింహ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, ఎదునూరి రామచంద్రం,,ఆరుట్ల మహేష్, శ్రీనివాస్ ,ఉప్పల చంద్రం,కోడె శ్రీనివాస్, బాలేళ్ళు బాను , , కుల సంఘాల, కుల పెద్దలు, యువజన సంఘాలు,, తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily