Wednesday, 11 September 2024 12:04:17 PM
 Breaking
     -> వరద బాధితులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ .....      -> మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు...! ఫోన్ ద్వారా రెండు జిల్లాల కలెక్టర్ల తో మాట్లాడి పరిస్థితి సమీక్ష....      -> జిల్లా యంత్రాంగం సూచనలను పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : - ఎస్పీ రోహిత్ రాజు ..      -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..

అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం...

-


M. SURESH BABU , GARLA MANDAL REPORTER, MAHBUBABAD.

Reporter

Date : 29 August 2024 07:45 PM Views : 70

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/గార్ల : మహిళల భద్రత, సైబర్ క్రైమ్ ,ట్రాఫికింగ్ మరియు మత్తు పదార్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ ఐపీస్ ఆదేశానూసారంగా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య ఆధ్వర్యంలో, ఏకలవ్య మోడల్ స్కూల్ నామలపాడు ,బయ్యారం, మహబూబాబాద్ జిల్లా నందు ఈ షిటీమ్ అవగాహన కార్యక్రమం లొ బయ్యరం సీఐ రవి కుమార్, బయ్యారం ఎస్సై తిరుపతి, షిటీమ్ ఏ ఎస్ ఐ ఆనందం పాల్గొని షీ టీం గురించి వివరిస్తూ, విద్యార్థులందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ గాని, వాట్సాప్ కాల్ గాని మాట్లాడవద్దని అన్నారు.అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత గ్రూపుల నుండి వచ్చినటువంటి లింకులను ప్రెస్ చేయవద్దని వివరిస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని, దీనిలో భాగంగా మహిళలు ఆపద సమయంలో డయల్100,షీ టీమ్ నెంబరుకు సంప్రదించాలని అన్నారు. ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినపుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టీ సేఫ్,అప్ ( ట్రావెల్ సేఫ్ ) ను ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ని సంప్రదించి ,వారి సమస్యలను పరిష్కరించుకొవాలని తెలిపినారు. ప్రత్యేకంగా చిన్న పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్‌ టచ్ మీద అవగాహన కల్పించాలని అవసరమైన ఆత్మ రక్షణ విద్యలను నేర్చుకోవాలి అని సోషల్ మీడియా ను వాడుతున్న వారు వాటి పరిధి ని తెలుసు కోవాలని అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదని, ఒక వేళ సోషల్ మీడియా లో హరాస్మెంట్,సైబర్ క్రైమ్ కు గురి అయితే తక్షణమే షీ టీమ్ కానీ,పోలీసులకు కానీ సంప్రదించాలని తెలియపరిచ్చినారు.షీ టీం ను సంప్రదించడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని పేస్ బుక్,ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ ఉపయోగించుకోవాలని,అలాగే సోషల్ మీడియా లో కూడా షీ టీం ను సంప్రదించవచ్చని తెలియచేయడం జరిగినది. ఇంకా మానవ అక్రమ వివాహ రవాణా, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్యూఆర్ కోడ్ పిటిషన్ మరియు సైబర్ నేరాల అండ్ సైబర్ సెక్యూరిటీ సేవలు,1930, డయల్ 100 మరియు ఫోక్సో చట్టాల గురించి బాల్య గురించి 100 మంది విద్యార్థినీలకు అవగాహన కల్పించినారు.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా అమ్మాయిలు వివిధ గ్రామాల నుండి వస్తుంటారని,ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని తమ వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత ఫోటోలని సోషల్ మీడియాలో గాని, ఇతరులకు గాని షేర్ చేయొద్దని.. అట్టి ఫోటోలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది, కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా అలా బ్లాక్మెయిల్ చేసినట్లయితే పరువు పోతుందని భయపడకుండా షీ టీమ్ ని సంప్రదించాలని,షీ టీం కి కంప్లైంట్ చేసినట్లయితే కంప్లైంట్ యొక్క వివరాలు గొప్యం గా ఉంచబడతాయని, బాధితురాలు షీ టీమ్ ఆఫీస్ కి రాలేని పక్షంలో షీ టీం సభ్యులే వారి దగ్గరికి వెళ్తారని కావున ఎలాంటి భయం లేకుండా కంప్లైంట్ చేయాలని, షీ టీమ్ వాట్స్ అప్ నంబర్స్ 8712656935, 7901142009 కి తెలియచేసిన చో తగిన చర్య తీసుకుంటామని తెలిపారు. కలజాగృతి బృందం; సతిష్, తిరుపతి, ప్రధానోపాధ్యాయులు అశోక్ కుమార్, వైఎస్ ప్రిన్సిపాల్ ధనరాజ్, షీ టీం సిబ్బంది డబ్ల్యూపీసీ అరుణ,పార్వతి, భరోసా స్టాఫ్ సాహితీ, సుప్రజ తదితరులు పాల్గొన్నారు.

-


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :