Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ సెప్టెంబర్ 18 (అక్షరంన్యూస్) తల్లాడ మండల వ్యాప్తంగా పట్టణంతో పాటు పల్లె పకృతి వనంలో ఉన్న కోనా కార్పస్ మొక్కలను తొలగించాలని ప్రజల కోరుతున్నారు. కోనా కార్పస్ ఈ చెట్ల వల్ల ప్రాణాపాయ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందునా వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక పట్టణాల్లో ఈ చెట్లను తొలగిస్తున్నారని, ఇక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా చెట్లను కట్ చేసి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ చెట్ల స్థానంలో ఆక్సిజన్ అందించే మొక్కలను అందులో భాగంగా గానుగా, వేప, పూలు, పండ్ల మొక్కలను నాటాలని కోరారు. తల్లాడ మండలంలో పల్లె ప్రకృతి వనంలో ఈ చెట్లను వేపిక పెంచారు. వెంచర్లల్లో ఉన్న కోనా కార్పస్ మొక్కలను తొలగించి ఆక్సిజన్ అందించే మొక్కలను నాటాలని కోరారు. ఇకనైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి ఆ మొక్కలను తొలగించి ప్రజలకు అవసరమైన మొక్కలను పెంచి ప్రకృతిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily