Sunday, 08 September 2024 08:21:11 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

గంట ముందు ఖమ్మం పంపిస్తే శిశువు బ్రతికేదే..*

నిర్లక్ష్యం చేసినట్లు రుజువైతే వైద్యసిబ్బందిపై చర్యలు..* *ఈ నివేదికను జిల్లా అధికారులకు పంపిస్తా..* *తల్లాడ పీహెచ్సీలో ఘటనపై స్పందించిన సత్తుపల్లి డిప్యూటీ డిఎంహెచ్ వో సీతారాం..*


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 14 July 2024 04:26 PM Views : 727

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * ఖమ్మం/ తల్లాడ జూలై 14 (అక్షరంన్యూస్) *గర్భిణీకి కాన్పు నొప్పులు మొదలైన దగ్గరనుంచి గంటలోపు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం పంపిస్తే శిశువును కాపాడుకోగలిగే వాళ్ళమని సత్తుపల్లి డిప్యూటీ డిఎంహెచ్ వో సీతారాం అన్నారు. ఆదివారం తల్లాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో శిశువు జన్మించి మరణించిన విషయంపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తల్లాడలో శిశు మృతిచెందటం బాధాకరమన్నారు. గతంలో ఈ గర్భిణి లావణ్యకు మొదటి కాన్పు ఇక్కడే జరిగిందని, హాస్పటల్ పై గౌరవం ఉండటం వల్లే రెండో కాన్పు కోసం ఇక్కడికి వచ్చారని గుర్తు చేశారు. ఉదయం 10 గంటలకు నొప్పులు ప్రారంభమైతే వాటిని వైద్య సిబ్బంది పరిశీలించి వాతం నొప్పులని, ఆమెకు కూర్చోవడం, తదితర ఆసనాలు చూపెట్టారని తెలిపారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు మరలా డెలివరీ నొప్పులు ప్రారంభం అయ్యాయన్నారు. ఈ సమయంలో బేబీ తలభాగం వచ్చి ఆలస్యం కావడంవల్ల ఉమ్మనీరు తాగి మృతి చెందటం జరిగిందన్నారు. నొప్పులు ప్రారంభమై గంట ముందు ఖమ్మం పంపిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉండే వారిని తెలిపారు. ఈ నేపథ్యంలో తల్లిని కాపాడుకునేందుకు ఖమ్మం తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుంటారన్నారు. తల్లాడ ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయన్నారు. ఏడాదికి సుమారు 100 కాన్పులు చేస్తారని వెల్లడించారు. నెలలో సుమారు 10 లేదా 12 వరకు డెలివరీలు ఉంటాయన్నారు. కుర్చీలో స్టాఫ్ నర్స్ కుమారుడు కూర్చున్న విషయంపై విలేకరులు ప్రశ్నించగా.. అది వ్యక్తిగత విషయమని, దానిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. తల్లాడ మండలంలో ప్రజలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, ఆసుపత్రిలో నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.*

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :