Sunday, 08 September 2024 08:21:36 AM
 Breaking
     -> ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి : -ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.....      -> కిన్నెరసాని నది వరద ఉధృతిని పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..      -> గణేష్ మండపాల ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి : - డీజె లకు అనుమతి లేదు.....      -> ఉచిత వక్త శిక్షణా తరగతులు : -తెలంగాణ సమన్వయకర్త డా.బి.కృష్ణయ్య -..      -> భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అప్ర‌మ‌త్తంగా ఉండండి.....      -> ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :-అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.....      -> ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -పునరావాస కేంద్రాల్లో ఎలాంటి లోటు రావద్దు....      -> సహాయక చర్యలు, పునరావాస ఏర్పాట్లలో అలసత్వం వద్దు-ముంపు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అప్రమత్తతతో పనిచేయాలి....      -> అంతటా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : -డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి, సీ.ఎస్....      -> భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు : -కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ... ..      -> జిల్లాలో భారీ వర్షాలు....ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... కలెక్టర్ జితీష్ వి. పాటిల్...      -> గణేష్ మండపాల నిర్వహకులు పోలీసుల అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాలి :   ఎస్పీ రోహిత్ రాజు ....      -> అపరిచిత వ్యక్తులతో సంభాషించకూడదు... రవి కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బయ్యారం.....      -> అమలుగాని హైకోర్టు తీర్పు...విశ్వ జంపాల న్యాయవాది.....      -> నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు అరెస్ట్..      -> సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు :- కలెక్టర్ జితేష్ వి పాటిల్..      -> ప్రజావాణి 1.150 ఫిర్యాదులు ..      -> పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక ద్రుష్టి సారించండి :-వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలి.....      -> రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించవద్దు : -బీఎస్పీ నూతన జిల్లా కమిటీ నియామకం....      -> ఆపరేషన్ ముస్కాన్-10వ విడతలో 22 మoది బాలకార్మికులకు విముక్తి : -బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ... ..

తల్లాడ రింగురోడ్డును పట్టించుకోని అధికారులు..

ఎక్కడా కూడా కనిపించని నాటిన మొక్కలు.. వందల సంఖ్యలో వేస్తే నామమాత్రంగా కనిపిస్తున్న వైనం..


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 11 July 2024 02:31 PM Views : 635

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ జూలై 11 (అక్షరంన్యూస్) తల్లాడ రింగురోడ్డు రోజురోజుకు శిధిలావస్థకు చేరుతుంది. రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఇనుప డ్రిల్స్ విరిగిపోతున్నాయి. వివిధ వాహనాలు ఢీకొని డ్రిల్స్ విరిగిపోయి ఉన్నప్పటికీ వాటికి మరమ్మత్తులు చేయాల్సిన అధికారులు తూతూమంత్రంగా వదిలేస్తున్నారు. వాటిని ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. డివైడర్ లేకపోవడంతో అనేక ప్రమాదాలు ఇటీవల కాలంలో జరిగాయి. దీంతో మండల అధికారులు తూతూమంత్రంగా డివైడర్ మధ్యలో పూలకుండీలను పెట్టి చేతులు దులుపుకున్నారు. కనీసం ప్రమాద హెచ్చరిక, సూచిక బోర్డులు పెట్టకుండా పూలకుండీలు పెట్టి మసి పూసి మారేడు కాయచేసిన సందంగా చేస్తున్నారు. రింగు చుట్టు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు కనిపించకుండా పిచ్చి మొక్కలు మాత్రం ఏపుగా పెరిగి పెరగటంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు రింగ్ రోడ్డు చుట్టూ భారీగా వరద నీరు చేరుతుండటంతో పాటు ఆ ప్రాంతంలో నీరు నిల్వ ఉండటంతో డ్రైనేజీ గుంత కనిపించక అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మండల కేంద్రానికి పట్టుకొమ్మగా ఉన్న రింగురోడ్డుని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం లక్షలాది రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ ఆ నిధులను ఏం చేస్తున్నారు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. సంబంధించిన అధికారులు ఏనాడు కూడా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తల్లాడ మేజర్ పంచాయతీలో నర్సరీ నుండి వేల సంఖ్యలో పంచాయతీ మొత్తం మొక్కలు నాటితే అవి ఇప్పటివరకు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. సరైన నీరు వాటికి ఏర్పాట్లు చేయకపోవడంతో చెట్లు విరిగి కనిపించడం లేదు. కేవలం అక్కడక్కడ మాత్రమే చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పల్లె ప్రకృతి వనం కూడా ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయింది. లక్షలు హెచ్చించి పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని మాత్రం ప్రజలకు అందుబాటులో తేవటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి చేతుల మీదుగా ఓ వెంచర్ లొ మొక్కలు నాటించారు. హరితహారంలో నాటిన మొక్కల్లాగానే వీటిని కూడా పట్టించుకుంటారో లేరోనని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. హరితహారం, వనమహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వాలు లక్షలాది రూపాయల వెచ్చించి మొక్కలు నాటాలని ఊరూరా ప్రచారంతోపాటు నిధులను సమకూరుస్తుంటే మండల అధికారులు తీరువల్ల ఆ పథకాలు అభాష్ పాలు అవుతున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న తల్లాడ మండల అధికారులపై విచారణ చేసి జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2024. All right Reserved.

Developed By :