P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి జనవరి 05 (అక్షరం న్యూస్) ఓదెల మండల కేంద్రంలోని రైల్వే గేటు మీద ఆర్ఓబీ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు ఎంత వరకు వచ్చాయనే దానిపై ఎంపీ వంశీకృష్ట రైల్వే అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు, ఆర్ఓబీ స్థలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను ఓదెల ఆర్ఓబీ గురించి అడగడం జరిగిందని వెంటనే అశ్విణి వైష్ణవ్ అనుకూలంగా స్పందించారు, రైల్వే తరుపున రీసెర్చ్ కోసం పంపడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎంపీగా తనను కూడా ఆన్గ్రౌండ్ ఇన్స్ఫెక్సన్లో కూడా పాల్గొనవచ్చన్నారు. దాంట్లో బాగంగా ఈ రోజు రైల్వే అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. అదే విధంగా అధికారులు తయారు చేసిన ఆర్ఓబీ అలైన్మెంటును ఎంపీ పరిశీలించారు. ఆర్ఓబీ నిర్మాణం వల్ల సామన్య ప్రజలకు నష్టం లేకుండా, రీహాబిటేషన్ తక్కువ ఉండేలా అలైన్మెంటు తయారయ్యేలా చూడాలన్నారు. ప్రజల ఇబ్బందులు తీర్చేలా ఆర్ఓబీని తొందరగా పూర్తి చేయలాన్నారు. ఇప్పటికే ఎల్సీ 39 కునారం ఆర్ఓబీ, ఎల్సీ 49 కుందనపల్లి, ఎల్సీ 48 చీకురాయి ఎస్టిమేషన్ తయారవుతుంది. అలాగే గౌరెడ్డిపేట వద్ద వంద శాతం ఫండింగ్ శాంక్షన్ అయింది. అలాగే ఎల్సీ 46 పెద్దంపేట, ఎల్సీ 52 లు ఎస్టిమేషన్ జరుగుతంది. ఎల్సీ 44 అందుగులపల్లి ఎస్టిమేషన్ అవుతుందని ఎంపీ పేర్కొన్నారు. పరిశీలించిన ఎంపీ రైల్వే అధికారులు ప్రసాద్, సుశాంత్లకు ఆర్ఓబీ నిర్మాణం తొందరగా జరిగేలా చూడాలని సూచించారు. అలాగే ఓదెల రైల్వే స్టేషన్లో ఎంపీ ప్రయాణికులతో మాట్లాడారు వారంతా రైల్వేస్టేషన్లో ఉన్న సమస్యలను ఎంపీ దృష్టికి తెచ్చారు. తాగునీరు, టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు ఎంపీ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో స్టేషన్లో నెలకొన్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యేలా చేస్తానన్నారు. అన్నారు ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు సికింద్రాబాద్ డివిజన్ నుండి ప్రసాద్ మరియు రామగుండం రైల్వే ఏడి శశాంక్ తోపాటు స్థానిక తహసిల్దార్ దిరాజ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గౌతం నాయకులు అల్లం సతీష్ గుండేటి ఐలయ్య యాదవ్ సింగల్ విండో మాజీ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి అల్లంకి శశి మూర్తి పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ గడిగొప్పుల సంతోష్ కలవేన శ్రీనివాస్ ముంజాల మధు ఇప్పనపల్లి వెంకటేష్
.
Aksharam Telugu Daily