GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - తెలంగాణ స్టేట్ బ్యూరో / హైదరాబాద్ : ! అక్షరం ప్రతినిధి హైదరాబాద్ ఆర్డినెన్స్‌తో సంబంధం లేకుండానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది..! తెలంగాణ సర్కార్ బిగ్ స్టెప్..! ఆర్డినెన్స్‌కు అప్రువల్ రాకపోయినా రిజర్వేషన్లు? ఆర్డినెన్స్‌తో సంబంధం లేకుండానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగా రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసి, వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం.. ఢిల్లీ వేదికగా కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నది. మరోవైపు భవిష్యత్ కార్యచరణపై సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. రెండు మూడు రోజుల్లో మంత్రులు, సీనియర్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న చివరి అవకాశాలపై ఆరా తీయనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఆ అధికారంతో రిజర్వేషన్లపై జీవో జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రిజర్వేషన్ల ఉత్తర్వులు విడుదల చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కోర్టులో చాలెంజ్ చేస్తే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. దీంతో సర్కారు రిజర్వేషన్ల పెంపుపై విడుదల చేసే జీవోను కోర్టుల్లో ఎవరూ సవాలు చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు ప్రభుత్వం అప్పీలు చేయనున్నది. కోర్టులో కేసు వేయకుంటే ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తున్నది. ఒకవేళ ఎవరైన చాలెంజ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, లేదంటే కోర్టులు స్వయంగా జోక్యం చేసుకుని 50 శాతం కన్నా ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏంటని సర్కారు ఆలోచిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒక వేళ కోర్టు కొట్టేస్తే పాత పద్ధతిలోనే చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు (25 నుంచి 27 శాతంలోపు) కల్పించాలని మిగతా వాటిని (42 శాతం) పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా, ఇటు రాజకీయపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రపతి వద్ద పెండింగ్.. కులగణన ప్రకారం బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన బిల్లులను ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. వాటిని పరిశీలించిన గవర్నర్.. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. కానీ, వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు పంచాయతీ రాజ్ చట్టం –2018లోని 285Aను సవరించి, ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదం కోసం పంపారు. ఆ ఆర్డినెన్స్‌పైనా గవర్నర్ సంతకం చేయకుండా రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. దీంతో అవి పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇండియా కూటమిలోని ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేసినా కేంద్రం స్పందించలేదు.
.
Aksharam Telugu Daily