Thursday, 15 January 2026 06:44:20 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

27,000 తగ్గిన బంగారం ధర..?

బంగారం ధర అకస్మాత్తుగా రూ.27,000 తగ్గింది…? కారణాలు తెలిస్తే బంగారం ప్రియులు సంతోషిస్తారు.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 17 May 2025 08:04 AM Views : 9842

అక్షరం తెలుగు డైలీ - సిల్వర్ స్క్రిన్ / పెద్దపల్లి/ఓదెల : ఓదెల పెద్దపల్లి 17 అక్షరం ప్రతినిధి.... బంగారం ధర నేడు భారీగా తగ్గింది. బంగారం ధరలు ఇలా ఉన్నాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95800 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 88140 రూపాయలు పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు ఒక కేజీ వెండి ధర 98500 రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు గడచిన మూడు రోజులుగా తగ్గుతున్నాయి. పసిడిప్రియలకు తగుతున్న బంగారం ధరలు ఊరట కలిగిస్తున్నాయి. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో గమనించినట్లయితే భారీగా తగ్గుదలను గమనించవచ్చు. ప్రస్తుతం ఒక ట్రాయ్ ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర 3180 డాలర్ల వద్ద పలుకుతోంది. గతంలో ఇది 3500 డాలర్ల వద్ద ఆల్ టైం గరిష్ట స్థాయిని నమోదు చేసింది.అంటే దాదాపు 320 డాలర్లు తగ్గింది. మన కరెన్సీలో పోల్చి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 27 వేల రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా అమెరికా చైనా మధ్య కుదిరిన టారిఫ్ తగ్గింపు ఒప్పందం ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా లాభాల్లో ప్రయాణిస్తున్నాయి. అలాగే డాలర్ విలువ కూడా పెరిగింది. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గడం ప్రారంభించాయి. బంగారం ధరలు తగ్గుతున్న వేళ పసిడి మార్కెట్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకొని స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతున్నాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గినప్పటికీ, రిటైల్ మార్కెట్లో మాత్రం 10 గ్రాముల బంగారం ధర 95 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది. నిజానికి ఫ్యూచర్స్ మార్కెట్ ప్రకారం గమనించినట్లయితే బంగారం ధర దాదాపు రూ. 90 వేల రూపాయల వరకు పతనం అయింది. కానీ అది రిటైల్ మార్కెట్లో తగ్గడానికి కాస్త సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గమనిక.... పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :