Thursday, 15 January 2026 06:38:29 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కండి : సీఎం రేవంత్ రెడ్డి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 07 January 2026 06:42 PM Views : 434

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : *!* హైదరాబాద్ అక్షరం :జనవరి 07 తెలంగాణ రాష్ట్రంలో త్వర లో మున్సిపల్ ఎన్నికలు మొదలుకా నున్నవి బీసీల రిజర్వేషన్ల అంశం తేల్చకుం డానే రేవంత్ రెడ్డి, సర్కార్ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది,ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చకాచకా చేస్తున్నది మార్చిలో వార్షిక పరీక్షలు ఉన్నందున ఆలోపే మునిసిపల్ ఎన్నికలు ముగించాలని యోచిస్తున్న ది, సంక్రాంతి పండుగకు ముందే షెడ్యూల్ ను విడుదల చేసి ఫిబ్రవరిలో ఒకే విడుత లోపోలింగ్ నిర్వహించేలా అడుగులు వేస్తున్నది... ఈ నేపథ్యంలోనే మున్సిప ల్ ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సిఎం రేవంత్‌రెడ్డి, సూచించారు. ఈ నెల 8న కాంగ్రెస్ విస్తృ త స్థాయి సమావేశం జరుగనున్న నేపథ్యంలో సమావేశంలో చర్చించే అంశాలు, ప్రస్తుతం అసెంబ్లీలో పలు అంశాలపై జరుగుతున్న చర్చలతో పాటు తాజా రాజకీయాలపై సిఎం రేవంత్‌రెడ్డి, మంగళ వారం అసెంబ్లీలోని తన చాంబర్ లో సుమారు అరగంట పాటు మంత్రులు, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌ కుమార్ గౌడ్‌,తో చర్చించి నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే పలు అంశాలపై మంత్రులకు, పిసిసి అధ్యక్షుడికి సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి మా ట్లాడుతూ..... మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకోవా లని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దని, సమర్ధవంతులకే టికెట్‌లు కేటాయించాలని సూచించినట్టుగా తెలుస్తుంది.. అ భ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేయాలని, సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆయన పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే డిసిసి అధ్యక్షు లను నియమించుకున్నా మని, కానీ, పూర్తిస్థాయిలో జిల్లాల కార్యవర్గాన్ని ప్రకటించలేదని అందులో భాగంగా ఈనెల 08వ తేదీ న జరిగే కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో డిసిసి అధ్యక్షులందరూ పూర్తి స్థాయి కార్యవర్గానికి సంబంధించిన జాబితాను పిసిసి అధ్యక్షుడికి అందిం చాలని సిఎం రేవంత్‌రెడ్డి వారికి సూచించినట్టుగా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అన్ని బిల్లులతో పాటు కృష్ణా జలాల పంపిణీ, హిల్ట్ పాలసీపై సభ్యులు సమర్ధవంతంగా చర్చించారని, ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానం ఇచ్చారని సిఎం మంత్రు లను అభినందించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కల్వకుంట్ల కవిత మండలిలో మాట్లాడిన వ్యాఖ్యల వల్ల ప్రజల్లో జరుగుతున్న చర్చ గురించి కూడా సిఎం రేవంత్, మంత్రులు చర్చించినట్టుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున చేపట్టాల్సిన అంశాలు, వ్యూహాల గురించి సిఎం రేవంత్‌రెడ్డి 8వ తేదీన జరిగే సమావేశంలో ప్రకటిం చనున్నారు.ఈ సమావేశం లో భాగంగా మున్సిపల్ ఎన్నికలు, పార్టీ అభ్యర్థులు, డిసిసి కార్యవ ర్గం తదితర అంశాలకు సంబంధించి అందరి అభిప్రాయాలను సేకరించి ముందుకెళ్లాలని సిఎం రేవంత్‌రెడ్డి, నిర్ణయిం చి నట్టుగా తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ చార్జీ మీనాక్షి నటరాజన్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :