Jakkani Rajaramesh , SIRCILLA.Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల, జనవరి-30, (అక్షరం న్యూస్): శుక్రవారం ఉదయం సుమారు 07:45 గంటలకు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం, రగుడు వద్ద ఉన్న ఎస్ ఎస్ టి బృందం చెక్‌పోస్ట్ లో వాహన తనిఖీలు నిర్వహించగా, ఈ సందర్భంగా టీజీ 23 ఏ 1524 నంబర్ గల కారును పోలీస్ బృందం ఆపి తనిఖీ చేయగా, కార్ డ్రైవర్/యజమాని గణాచారి సాంభాషివ్, తండ్రి శంకరయ్య, నివాసం ఇంటి నం. 6-3-65, మార్కెట్ రోడ్, వేములవాడ పట్టణం, రాజన్న సిరిసిల్ల జిల్లా గల వ్యక్తి, తన కారులో లెక్కలలో లేని. అనుమానాస్పదమైన నగదు రూ. 20,00,000/- రూపాయలు ఇరవై లక్షలు మాత్రమే తీసుకెళ్తున్నట్లు గుర్తించబడినది.ఆ నగదు మొత్తాన్ని ఎన్నికల నిబంధనలు చట్టపరమైన విధానాల ప్రకారం, ఎస్ఎస్టి బృంద ఇన్‌చార్జ్ జి. ఆనంద్, ఏపీఆర్ఓ సమక్షంలో, మధ్యవర్తుల పంచనామా సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడమైనది. ఆ నగదు యొక్క మూలం ఉపయోగ ఉద్దేశ్యం తెలుసుకునేందుకు తదుపరి విచారణ దర్యాప్తు కొనసాగుతోంది. అని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కె.కృష్ణ తెలిపారు.
.
Aksharam Telugu Daily