Saturday, 07 February 2026 04:36:47 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వ్యవసాయ మార్కెట్లో యువకుడి దారుణ హత్య ....

అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపిన వైనం .... ఆపై భార్యపై కత్తితో దాడి..! ..... అక్రమ సంబంధమే కారణమా....?


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 28 April 2025 08:23 PM Views : 1100

అక్షరం తెలుగు డైలీ - క్రైం న్యూస్ / పెద్దపల్లి : .... పెద్దపల్లి ప్రతినిధి ఏప్రిల్ 28 అక్షరం న్యూస్; పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. వ్యవసాయ మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపిన వైనం ఇది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో. ఈ ఘాతుకానికి పనపడినట్లు తెలుస్తుంది. అక్కడే ఉన్న తన భార్యపై కూడా కత్తితో దాడికి పాల్పడగా, ఆమె ప్రాణాపాయ స్థితి నుండి తప్పించుకున్నారు. ప్రత్యక్ష సాక్షులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో అప్పన్నపేట గ్రామానికి చెందిన పొలాం కుమార్ 40 అనే యువకుడినీ ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ కత్తితో గొంతు కోసి ఆ తర్వాత పొడిచి దారుణంగా హత్య చేశాడు. అక్కడే ఉన్న తన భార్య పై కూడా కత్తితో దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది. సంతోష్ భార్య తో పొలం కుమార్ కు ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు దారి చేసినట్టు తెలుస్తుంది. సంతోష్ తన ప్రియురాలితో కలిసి కుమార్ ను హతమార్చాలని ప్రణాళిక రూపొందించినట్ల తెలుస్తుంది. ఇందులో భాగంగానే పథకం ప్రకారం ఇద్దరు వ్యవసాయ మార్కెట్లో ఉండి కుమార్ ను అక్కడికి పిలిచినట్టు సమాచారం. అర్థం చేసుకున్న కుమార్ సంతోష్ పై దాడి దిగినట్లు తెలుస్తుంది. పోలం కుమార్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తుండగా, సంతోష్ అప్పన్నపట గ్రామంలో వ్యవసాయం పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. కాగా పొలం కుమార్ సంతోష్ లు ఇద్దరు దగ్గర బంధువులు కావడం గమనార్వం. ఈ మేరకు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు లక్ష్మణ్ కుమార్ బుద్ధి మల్లేశులు సంఘటన స్థలాన్ని సందర్శించి, నిందితుడినీ, అదుపులోకి తీసుకోవడంతో పాటు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :