AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / హైదరాబాద్ : ఢిల్లీ / అక్టోబర్ 12 / అక్షరం న్యూస్ -: ఢిల్లీ లో ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, జాటోతు రామచంద్ర నాయక్, కె.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నమ్మిండ్ల శ్రీనివాస్‌తో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు *శ్రీ మహమ్మద్ అయూబ్* పాల్గొన్నారూ. ఈ సందర్భంగా నాయకులు ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తు నినదించారు.
.
Aksharam Telugu Daily