GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -22(అక్షరం న్యూస్ ) ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న పేలుడు పదార్దాలైన జిలెటిన్ స్టిక్స్, డిటోనోటర్స్ బాక్సులను టాస్క్ ఫోర్స్, ముస్తాబాద్ పోలీసులు పట్టుకున్న సంఘటన ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం లో చోటుచేసుకుంది ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం లో నిజామాబాద్ జిల్లా నందిపేట్ గ్రామానికి చెందిన గడిపర్తి శ్రీనివాస్ రావు అతని యజమాని ఓర్పు సాయి మల్లు ఆదేశాల మేరకు టాటా వాహనము లో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు తీసుకువచ్చి నామ పూర్ గ్రామంలోని శివరాత్రి రాజు అనే వ్యక్తి కి బండ పనుల నిమిత్తం అమ్ముతుండగా నమ్మధగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సీ ఐ నటేష్, ముస్తాబాద్ ఎస్ ఐ గణేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు వారి వద్ద నుండి 2600 జిలెటిన్ స్టిక్స్, 405ఐడియాల్ బూస్టర్ జిలిటెన్ స్టిక్స్,6000వేల మీటర్ల ఐడియాల్ కార్డ్స్ వైరు, 175డెటోనేటర్స్, తో పాటు టాటా యోదా వాహనము స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ రావు, శివరాత్రి రాజు, ఓర్పు సాయి మల్లు అనే ముగ్గురు వ్యక్తుల పై కేసు నమోదు చేసి ధర్యాప్తు చెప్పట్టి నట్లు ఎస్ ఐ గణేష్ తెలిపారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ .. ఎవరు కూడా ప్రజా నివాస ప్రాంతాల్లో ఎలాంటి లైసెన్స్ లేకుండా జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు నిల్వ ఉంచుతే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జెలాటిన్ స్టిక్స్ కానీ పేలుడు పదార్ధాలు ఎవరైనా వినియెగించాలనుకుంటే దానికి సబంధిచిన అనుమతి లైసెన్స్ తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన పోలీసులకు సమాచారం అందించాలని కోరారు
.
Aksharam Telugu Daily