DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / పెద్దపల్లి : .... పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 29 అక్షరం న్యూస్; ఓ కుంట నుండి వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు ఏర్పాటుచేసిన పంట కాలువ అది. ప్రస్తుతం ఆ పంట కాలువ నిరుపయోగంగా మారడంతో ఓ రిటైర్డ్ కార్మికుడి దృష్టిలో పడింది. ఇంకేముంది దౌర్జన్యంగా అక్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. గ్రామస్తులు వద్దని వారించిన కూడా ఆయన వినిపించుకోలేదు. పిల్లర్లు నిర్మించి బేస్మెంట్ ఏర్పాటు చేసే కాడికి వచ్చింది. చాలా ఆలస్యంగా పంచాయతీ అధికారులు స్పందించి నోటీసులు జారీ చేసి, పనులు నిలిపివేశారు. పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామంలో చొప్పరి నరసయ్య అనే రిటైర్డ్ కార్మికుడికి 360 సర్వే నంబర్ లో ఐదు గుంటల పట్టా భూమి ఉండగా, దానిని అనుకోనున్న పంట కాలువ స్థలంలో అక్రమ నిర్మాణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రామస్తుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. గతంలో పంట కాలువలో ఉన్న ఆ స్థలం ఖాళీగా ఉండటంతో బస్సు సెల్టర్ నిర్మాణం చేపట్టారు. బస్ సెంటర్ వెనుక మరికొంత స్థలం ఖాళీగా ఉండడంతో దానిపై కన్నేసిన నరసయ్య అక్రమ నిర్మాణం చేపట్టారని గ్రామానికి చెందిన పెగడ మల్లయ్య, నత్తెట్లా పూచాలు, కునారపు రాములు, పల్లె మొండయ్య, బాలసాని వెంకటేశం కునారం వెంకటేశం, ఆకుల వెంకటేశం, బాలసాని రాజయ్య, ప్రవీణ్, ఆకుల ఎల్లయ్య, సతీష్ ఆరోపించారు. ఈ విషయమై గతంలో జిల్లా కలెక్టర్కు, ఇటీవల గ్రామపంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు చేసినట్టు వారి తెలిపారు. నర్సయ్యకు పట్టాకు 5 గుంటల స్థలం మాత్రమే ఉండగా ఐదున్నర గంటలు కొనుగోలు చేసినట్టు దొంగ పత్రం సృష్టించి ఆ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ షెల్టర్ లో వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నామని వెనుక స్థలం కలుపుకొని బస్టాండు నిర్మాణం మరింత పెద్దగా చేయాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. అలాగే ఈ స్థలం గ్రామ అవసరాలకు కూడా వాడుకోవడానికి అవకాశం ఉందని అయితే నరసయ్య స్వార్థంతో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని ఈ విషయాన్ని తమ వ్యతిరేకిస్తే దౌర్జన్యం చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాన్ని గ్రామపంచాయతీకి అప్పగిస్తే ప్రజల అవసరాలకు వినియోగించుకుంటామని వారు తెలిపారు. నోటీసులు జారీ చేశా... .... పంచాయతీ కార్యదర్శి కలవేన శైలజ భోజన్నపేట గ్రామపంచాయతీలో అనుమతి లేకుండా చొప్పరి నరసయ్య అనే వ్యక్తి నిర్మాణం చేపడుతున్నట్టు తమ దృష్టికి రాగా అతనికి నోటీసులు జారీ చేసినట్టు భోజన్నపేట గ్రామపంచాయతీ కార్యదర్శి కలవేన శైలజ అక్షరం ప్రతినిధికి తెలియజేశారు. తాము నోటీసులు ఇచ్చి వారం అవుతున్న ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని ఆమె తెలిపారు. ఇలాంటి డాక్యుమెంట్ లేకుండా అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ నోటీసులు ఖాదర్ చేయకుండా నిర్మాణం చేపడితే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దీనిపై మరోసారి నోటీసులు జారీ చేసి అవసరమైతే అక్రమ నిర్మాణాన్ని తొలగించే ప్రక్రియ చేపడుతామన్నారు.
.
Aksharam Telugu Daily