AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / తెలంగాణ అప్డేట్స్ /అక్షరం డెస్క్ : అక్షరం ప్రతినిధి ఢిల్లీ ఇవాళ లోక్సభ ముందు కీలక బిల్లు ప్రవేశపెట్టనున్నారు పదవుల్లో ఉన్న ఎవరైనా నేరం చేస్తే ఉద్వాసన కల్పించే కొత్త బిల్లు తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్టయితే అంతే సంగతులు.. నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు పదవి పోయేలా బిల్లు.. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తీవ్ర నేరం చేస్తే సీఎం/పీఎం పదవి నుంచి ఔట్! ఐదేళ్లు, అంతకుమించి శిక్ష పడే అవకాశమున్న క్రిమినల్ కేసుల్లో అరెస్టై 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను పదవి నుంచి తొలగించే బిల్లును NDA ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. PMతో సహా మంత్రులు, రాష్ట్రంలో సీఎంతో పాటు మంత్రులు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. దీనికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయనుంది. రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన అమల్లోకి వస్తే పదవిని కోల్పోతారు. దీనిని ఖాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
.
Aksharam Telugu Daily