Sunday, 29 March 2026 03:25:19 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పడకేసిన పారిశుధ్యం*.. *కార్యాలయానికే అధికారులు పరిమితం*.. *ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు*..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 08 April 2025 04:42 PM Views : 1937

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ఏప్రిల్ 8 తల్లాడ (అక్షరంన్యూస్)* తల్లాడ లో పారిశుద్ధం పడకేసింది. ఏ వార్డులోకి వెళ్లిన మురికి నీరు, చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. అసలే అకాల వర్షాలు రావడంతో సీజన్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వివరిస్తున్నారు. మురికి నీరు కుళ్లిపోయిన వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధించిన అధికారులు చూసి చూడంగా వ్యవహరిస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ కార్యాలకు పరిమితం అవుతున్నారు. తప్ప గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించాల్సిన పాపాన పోలేదు. కార్యాలయాల్లో ఉంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో మండల అధికారులపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల అధికారులు ఎవరు కూడా ఈ సమస్యలపై దృష్టి పెట్టిన సందర్భాలు లేవు, ఈ సమస్యలు రెండు మూడు రోజుల్లో పరిష్కరించాలని, అధికారులు పట్టించుకోకపోతే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని మండల ప్రజలు కోరారు. అదేవిధంగా: తల్లాడ మండలం మల్సూర్ తండా గ్రామపంచాయతీలో డ్రైనేజీల్లో మురికి నీరు నిండి,కుళ్ళిపోయిన వ్యర్ధాలతో దుర్గంధం వెదజల్లుతుంది. మురికి నీళ్లలో దోమలు వృద్ధి చెంది మలేరియా టైఫాయిడ్, డెంగు జ్వరాలు వస్తున్నాయని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ జ్వరంతో మృతి చెందినట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారు. ఇకనైనా ఆ గ్రామ కార్యదర్శి మండల అధికారులు స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలని తండావాసులు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :