GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -29(అక్షరం న్యూస్ ) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ 71, 72 బూత్ లో గడప గడప ప్రచారంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.పాల్గొన్నారు.విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి చేపట్టిన ఈ ప్రచారంలో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ ను జూబ్లిహిల్స్ ప్రజలు నమ్మే స్థితిలో లేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అత్యవసరం అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ లను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం. గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనం" అని వారు పేర్కొన్నారు. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తేనే నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని, మౌలిక వసతులు మెరుగుపడతాయని, నిరుద్యోగులు, మహిళలు, పేద వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజలంతా ఆలోచించి, స్థిరమైన, సంక్షేమ పాలన అందించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు హస్తం గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులు కోరారు. కచ్చితంగా యువకుడు అయినా మా అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఇక్కడి ప్రజలు గెలిపిస్తారు. అని తెలిపారు ఈ ప్రచారం లో ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదునూరి భానుచందర్, మిడిదొడ్డి భాను కుమార్, బద్దిపడిగే అనిల్ రెడ్డి, పోతారం నవీన్ గౌడ్ పోతారం వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily