D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 8 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలోని కుర్నవల్లి గ్రామంలో టీవీ ముక్తు భారత్ అభియాన్ ప్రోగ్రామ్ డాక్టర్ ప్రత్యూష సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి లక్షణాల గురించి వివరించి, వల్నరబుల్ పాపులేషన్ 60 సంవత్సరాలు పై బడిన వారు, షుగర్ వ్యాధిగ్రస్తులక, 5 సంవత్సరాల క్రితం టీబి మందులు వాడిన వారు 3 సంవత్సరాల క్రితం టీబి మందులు వాడిన కాంటాక్ట్ పర్సన్స్ ఆయాసం, హెచ్ఐవి, డయాలసిస్, క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారందరికీ స్క్రీనింగ్ చేసి టీబీ వ్యాధి లక్షణాలున్న 92 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. ఎక్స్రేలకు కూడా మరుసటి రోజు వచ్చి వెహికల్ లో తీసుకెళ్లి ఛాతి ఎక్స్ రేలు తీయిస్తాం అని గ్రామస్తులకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిబి నోడల్ అధికారి పెద్ద పుల్లయ్య, తల్లాడ పంచాయతీ కార్యదర్శి వేణు,టీబీ చికిత్స సూపర్వైజర్ వై సురేష్, టీబీ ల్యాబ్ సూపర్వైజర్ ఆర్ సంజీవ్ కుమార్, కుమారి, ఏఎన్ఎం ఆదిలక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily