Monday, 06 July 2026 11:39:47 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రోడ్డు విస్తరణలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు .తిరిగి ఎన్టీఆర్ విగ్రహంని చౌరస్తాలో రోడ్డు మధ్యలో పున:ప్రతిష్ట చేస్తారా ?

ప్రధాన రోడ్డుపై రోడ్డు మధ్యలో తిరిగి ఎన్టీఆర్ విగ్రహంని ఏర్పాటు చేస్తారా? -లేక ఇంకా ఏదయినా విగ్రహంని ఏర్పాటు చేస్తారా అని సందేహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 06 July 2026 06:04 PM Views : 175

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : - చొప్పదండి /కరీంనగర్ ,జులై 06( అక్షరం న్యూస్ ) చొప్పదండి పట్టణం లోని ఎన్టీఆర్ చౌరస్తా లోని ఎన్టీఆర్ విగ్రహముని ఆదివారం రోజున సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనుల నిమిత్తము రోడ్డు విస్తరణలో భాగం గా ఎన్టీఆర్ విగ్రహం ని తొలగించారు . కొన్ని సంవచ్చరాల క్రితం చొప్పదండి పట్టణానికి చెందిన బీమానాతిని లక్ష్మీపతిఎన్టీఆర్ మీద వున్న అభిమానంతో,తన సొంత డబ్బులతో ఈయొక్క ఎన్టీఆర్ విగ్రహముని ఏర్పాటు చేశారు.. 1983 వరకు తెలుగు సినీ రంగంలో అగ్ర సినీ హీరో అయిన ఎన్టీఆర్ 1983 లో తెలుగుదేశం పార్టీనీ స్థాపించి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో 1983 లో అఖండ మెజారిటీని సాధించి 1983 లో అధికారము ను చేపట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని ఎన్టీఆర్ చేపట్టారు మరి తర్వాత 1985 లో, 1994 లో కూడా ముఖ్యమంత్రి పదవిని ఎన్టీఆర్ చేపట్టారు. ఆయన తీసుకువచ్చిన కొన్ని సంస్కరణలు రూపాయికి కిలో బియ్యం, మండల వ్యవస్థ ఏర్పాటు, తెలంగాణ లో పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు ఇలాంటి సంస్కరణల వలన తెలంగాణ లో కూడా ఎన్టీఆర్ కి ఇటు సినిమా పరంగాను మరో పక్క ముఖ్యమంత్రి గా ఆయన తీసుకువచ్చిన సంస్కరణల వలన తెలంగాణ లో కూడా ఎన్టీఆర్ కి వీరాభిమానులు అయ్యారు. మరి ఇంతటి అభిమానం చురగొన్న ఎన్టీఆర్ ని, తెలంగాణ ఉద్యమం మూలంగా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ని విస్మరించటం ఎంతవరకు సమంజసం అని ఆయన అభిమానులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ ఎన్టీఆర్ ని ఒక మహా నటునిగా, తెలంగాణ లో పటేల్, పట్వారి రద్దు లాంటి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన వ్యక్తిగా ఇప్పటికీ ఆరాదించాలి తప్ప ఒక ప్రాంతం వ్యక్తిగా చూడటం ఏమిటని కొందరు అంటున్నారు. సాదారణంగా ఎవరి విగ్రహం, ఏ విగ్రహం అయినా ఏదయినా కారణం చే తొలగించినప్పుడు తిరిగి పున ప్రతిష్టింప చేయడం సర్వ సాధారణం ఈ రకంగా చూసినప్పుడు ఎన్టీఆర్ విగ్రహం ని తిరిగి ఏర్పాటు చేయటం తత్యం. మరి ఎన్టీఆర్ విగ్రహంని ఎన్టీఆర్ చౌరస్తా లో ప్రధాన రోడ్డు మీద సెంటర్ లో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేస్తారా లేక వేరే ఏదయినా విగ్రహం ని ఏర్పాటు చేస్తారా అని పట్టణ ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :