P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల పెద్దపల్లి అక్టోబర్ 29 (అక్షరంన్యూస్) మండల ప్రజలకు మానేరు పరివాహక ప్రాంత ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు., పశువుల కాపర్లు చెరువులు, ఓర్రెలు వరద కాలువలు దాటవద్దని, గూడెం నక్కల ఒర్రె కొలనూర్ వరద కాలువ రైల్వే అండర్ బ్రిడ్జిలు నీళ్లు చేరి ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నదని యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. . ఇప్పటికే చెరువులు, వరద కాలువలు ఓర్రెల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసేలా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
.
Aksharam Telugu Daily