GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /ఆగస్ట్ -06(అక్షరం న్యూస్ ) హలో ఆరోగ్య శాఖ నుండి మాట్లాడుతున్నామంటూ బాధితులకు ఫోన్ చేసి, ఆసుపత్రి ఖర్చుల రీఫండ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సిరిసిల్ల జిల్లా సైబర్ టీమ్ హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. నిందితుని వివరాలు సిరిసిల్ల డి.ఎస్.పి చంద్రశేఖర్ వెల్లడించారు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ముల్లుంటి సలీం మాలిక్ అనే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 15 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడు సలీం మాలిక్ బాధితులకు ఫోన్ చేసి, ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రి ఖర్చులు తిరిగి చెల్లిస్తామని నమ్మబలికేవాడని. ఆ తర్వాత ఒక లింక్‌ను పంపి, ఆ లింక్‌లో యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు వారి అకౌంట్‌లో జమ అవుతాయని నమ్మించేవాడు,. బాధితులు ఆ లింక్‌ను ఓపెన్ చేసి పిన్ ఎంటర్ చేయగానే వారి ఖాతా నుండి డబ్బులు కోల్పోవడం జరిగిందని ఆలా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందిన రాజిరెడ్డి నిందితుడి మోసానికి గురయ్యారని తెలిపారు.. రాజిరెడ్డి రూ. 46 వేల రూపాయలు,రూ.10000 వేల రూపాయలు ఖాతా నుండి మాయం కావడంతో మోసపోయానని గ్రహించి స్టానికి ముస్తాబాద్ ఎస్ ఐ , ఎస్.ఐ గణేష్ కు పిర్యాదు చేయగా ఎస్ ఐ కేసు నమోదు చేశారు.జిల్లాఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్, జిల్లా సైబర్ టీమ్ ఆర్.ఎస్.ఐ జునైద్, సిబ్బంది కిట్టు, గంగారెడ్డి, కానిస్టేబుల్ కాసిం బృందంగా ఏర్పడి సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. సలీం మాలిక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎన్ సీ ఆర్ పి పోర్టల్ లో నమోదైన 79 పిటిషన్లలో సుమారు రూ. 15 లక్షల వరకు మోసాలకు పాల్పడినట్లు,. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు
.
Aksharam Telugu Daily