Friday, 17 April 2026 05:41:52 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

చదువుల్లో రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి -పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 05 July 2025 05:08 PM Views : 825

అక్షరం తెలుగు డైలీ - జాతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జూలై 5 అక్షరం న్యూస్; విద్యార్థులు చదువుల్లో రాణించి. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎసీపీ గజ్జి కృష్ణ యాదవ్ అన్నారు.పెద్దపల్లిలో మహాత్మ జ్యోతిభాపూలే పాఠశాల, కళాశాల విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో ఎసీపీ గజ్జి కృష్ణ యాదవ్ పాల్గొని మాట్లాడారు. మనకు ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని తల్లి తండ్రి తరువాత ఒక గురువు మాత్రమే మన ఎదుగుదలకు దోహదపడతారని విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను వివరించారు. తాను కూడా గురుకులంలోనే చదివానని గురువులు నేర్పిన చదువుతో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా ఎదిగి మీ ముందు నిల్చున్నానని ఆయన బాల్యస్మృతులను గుర్తుచేసుకున్నారు. సినిమాలు వేరు జీవితం వేరని ఇంటర్ నెట్ ప్రపంచంలో మంచి చెడు తెలుసుకొని మంచిని స్వీకరించాలని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసవుతూ యువత పెడదారి పడుతున్నారని సక్రమ మార్గంలో పయనిస్తే జీవితం పూల వనంలా మారుతుందన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు తారసపడినా భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చదువుల్లో బాలికలదే పై చేయి ఉందని ఈ విద్యా సంవత్సరం కూడా బాగా చదవాలన్నారు. తల్లి దండ్రులతో ప్రేమగా ఆప్యాయంగా నడుచుకోవాలని క్రమశిక్షణతో మంచి పేరు తెచ్చుకొని జిల్లా కీర్తిని చాటాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సమాజంలో మత్తుపదార్ధాలను నిర్మూలించాలంటూ ప్రతిజ్ఞ చేసి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు, జ్యోతిబాపూలే కళాశాలల ఆర్ సీఓ ఎం.అంజలి, ప్రిన్సిపల్ మణిదీప్తి, నశా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :