Thursday, 30 April 2026 06:10:01 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రైతులకు శుభవార్త.. 10 ఎకరాల వరకు ఒకేసారి.. త్వరలోనే ఖాతాలోకి నిధులు!


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 13 June 2025 07:24 PM Views : 900

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ జూన్13 తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. త్వరలో రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతుల అసంతృప్తిని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని సమాచారం. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రైతు భరోసాపై కీలక అప్డేట్ స్థానిక సంస్థల ఎన్నికలలోపే నిధులు విడుదల 10 ఎకరాల వరకు ఒకేసారి నిధులు జమ రైతు భరోసాపై కీలక అప్డేట్ రైతు భరోసాపై కీలక అప్డేట్ రైతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇప్పటికే అన్నదాతలు రైతు భరోసా నిధుల కోసం ఎంతో కాలంగా వేచి చూస్తున్నారు. మళ్లీ వానాకాలం వచ్చేసింది. కానీ ఇప్పటి వరకు రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో అందలేదు. దీనిపై రైతులు అసహనంతో ఉన్నారు. ఇదిలా ఉంటే సర్పంచ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. కచ్చితంగా మరో రెండు నెలల్లోపు సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాల్సిందే. లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లకు బ్రేక్ పడుతుంది. ఇప్పటికే కేంద్రం నుంచి రూ. 2 వేల కోట్ల గ్రాంట్లు పెండింగ్‌లో ఉండగా.. మరో రూ.2 వేల కోట్ల గ్రాంట్లు రావాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే ఇవి విడుదలవుతాయి. దీంతో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటే ప్రభుత్వం ముందు కొన్ని అడ్డంకులున్నాయి. మరీ ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం ఒకటి కాగా.. ఇక తాజాగా బస్ పాస్ ఛార్జీలను పెంచుతూ చిరుద్యోగులు, విద్యార్థులకు వ్యతిరేక నిర్ణయం తీసుకుంది. పైగా గ్యాస్ సిలిండర్ సబ్సీడీ డబ్బులు కూడా అందరి ఖాతాలో జమ కావడం లేదు.ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే భయం కాంగ్రెస్ వర్గాల్లో ఉందట. దీనికి పరిష్కారంగా రైతు భరోసా నిధులను ఒకేసారి పూర్తిస్థాయిలో విడుదల చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోందని సమాచారం. గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసి చాలా నెలలు అవుతోంది. దీంతో ఏ సమయంలోనైనా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందనే ఊద్దేశంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం.. వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈసీ రెడీ ఉంది. ఈక్రమంలోనే రేవంత్ సర్కార్.. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందే ముందు రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాలో జమ చేసేందుకు రెడీ అవుతోన్నట్లు తెలుస్తోంది. గత రబీ సీజన్‌లో ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేశారు. అయితే ఒకేసారి రైతులందరికీ ఇవ్వకుండా.. ఎకరాల వారీగా విడుదల చేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా అది కూడా అందరికి జమ కాలేదని వార్తలొచ్చాయి. అందుకే ఈసారి రెండు, మూడు రోజుల వ్యవధిలోనే.. ఒకేసారి 10 ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు వేయాలని ప్రభుత్వం భావిస్తోందట. ఈమేరకు అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఈ సారి 10 ఎకరాల వరకు ఒకేసారి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.!

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :