Wednesday, 05 August 2026 02:40:25 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

దూరం తగ్గనుంది - భారం తీరనుంది : త్వరలో అందుబాటులోకి వరంగల్​-కరీంనగర్ నేషనల్​ హైవే వరంగల్​-కరీంనగర్​ జాతీయ రహదారి పనులు 85 శాతం పూర్తి - కొద్ది రోజుల

వరంగల్​ నుంచి కరీంనగర్​ బైపాస్ హైవే


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 August 2026 10:52 AM Views : 53

అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / వరంగల్ జిల్లా : అక్షరం ప్రతినిధి వరంగల్ వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారి మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 85 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ హైవే ద్వారా వరంగల్ నుంచి కరీంనగర్​ మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. నాలుగు లైన్లలో నిర్మాణమవుతున్న ఈ జాతీయ రహదారి ఈ ఏడాది చివరి కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. నేషనల్​ హైవే-163కిది అనుసంధానం కానుంది. పలివెల్పుల శివారులో మొదలుకొని ఎల్లాపూర్, ఎల్కతుర్తి, తిమ్మాపూర్, కేశవపట్నం నుగునూర్ గుండా మానకొండూర్​ బైపాస్​ వరకు కొనసాగుతుంది. హైవేపైకి వాహనాలు ఎక్కడ ప్రవేశించాలంటే : వరంగల్ నుంచి కరీంనగర్​ మధ్య 68 కిలోమీటర్ల పొడవుతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (ఎన్​హెచ్​ఏఐ) ఆధ్వర్యంలో రూ.1,641 కోట్ల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణమవుతోంది. ఇందులో 23 వెహికల్ అండర్​ పాస్​లు, 121 బ్లాక్​ కల్వర్టులు, మానకొండూర్​ దగ్గర బైపాస్, తిమ్మాపూర్ వద్ద చిన్న బ్రిడ్జి, శంకరపట్నం దగ్గర కల్వర్టులున్నాయి. హనుమకొండ నుంచి ఎర్రగట్టు గుట్ట దగ్గర పరకాల రోడ్డు, గంటూర్​పల్లి రోడ్డు, హసన్​పర్తితో పాటు ఎల్లాపూర్​ వద్ద నుంచి ఈ కొత్త హైవే పైకి వాహనాలు ప్రవేశించొచ్చు. అందుబాటులోకి వస్తే ప్రయోజనాలెన్నో : ఈ రోడ్డు నిర్మాణంతో జాతీయ రహదారి-563 మార్గంలోని వరంగల్ నుంచి కరీంనగర్ మధ్య దూరం తగ్గుతుంది. నాలుగు లైన్లతో ఏర్పాటు కానుండటంతో ప్రధానంగా అనేక సరకుల రవాణా వాహనాలకు ఉపయుక్తం కానుంది. గతంలో వరంగల్​ నుంచి కరీంనగర్​ వెళ్లాలంటే సుమారు రెండున్నర గంటల సమయం పట్టేది. ఇకపై దీని ద్వారా గంట వరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో భారీగా ఇంధన ఖర్చు తగ్గడంతో పాటు చాలా సమయం కూడా ఆదా అవనుంది. ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు : రహదారి వెంట రెండు ఉమ్మడి జిల్లాల ఇండస్ట్రియల్ కారిడార్ మరింత పురోగతి సాధించనుంది. ముఖ్యంగా గ్రానైట్ పరిశ్రమలతో పాటు భవన నిర్మాణాలకు అవసరమైన ఎన్నో రకాల సరకుల రవాణాకు ఈ రహదారి అనువుగా మారనుంది. పరిసర జిల్లాల విద్యార్థులకు విద్య, వైద్య శిక్షణ సంస్థలు నెలకొల్పేందుకు అనుకూలంగా మారనుంది. రోడ్డు పొడవునా పలు రకాల ముడి, వ్యవసాయాధార పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. రహదారి పరిసర గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయాధారిత పరిశ్రమలకు సంబంధించిన ఎగుమతులు, దిగుమతులకు ఈ హైవేే ఎంతో దోహదపడనుంది. ఇరు జిల్లాల పర్యాటకానికి సులభం :ఈ నాలుగు లైన్ల రహదారి అందుబాటులోకి వస్తే వరంగల్​, కరీంనగర్​ జిల్లాల్లోని పర్యాటకం కూడా మరింత అభివృద్ధి కానుంది. వరంగల్​లోని చారిత్రక కట్టడాలైన వేయి స్తంభాల గుడి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, కరీంనగర్​లోని ఎలగందల కోట, ప్రముఖ జలాశయాలు వీక్షించేందుకు ప్రయాణం సులభం కానుంది. ఈ నేషనల్​ హైవే పొడవునా వివిధ రకాల చెట్లను పెంచనున్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :