AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రైతులకు తీపి కబురు అందించింది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందే రైతులకు మరో పథకం అమలుకు సిద్దం అయింది. అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసింది. దీని ద్వారా సాగు చేసే రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. తాజా పథకాన్ని మరింతగా విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం మరో పథకం అమలు ప్రారంభించింది. ఈ నెల నుంచే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకు వస్తోంది. ఇందు కోసం 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఏకంగా రూ.101.83 కోట్లను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి అమలు చేయనుంది. కేంద్రం వాటాగా 60 శాతం ఇవ్వనుండగా.. 40 శాతం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీకి వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు. వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందవచ్చు. ఎస్సీ, ఎస్టీ మహిళా రైతులు గరిష్టంగా వ్యవసాయ పనిముట్లపై 50 శాతం రాయితీ పొందే అవకాశముండగా.. ఇతర వర్గాలవారు 40 శాతం తగ్గింపు పొందవచ్చని అధికారులు వెల్లడించారు.
.
Aksharam Telugu Daily