Admin
అక్షరం తెలుగు డైలీ - రాష్ట్రీయం / హైదరాబాద్ : అక్షరం ప్రతినిధి హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త తెలిపింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటీవల రైతు భరోసా నిధులు విడుదల చేసి కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ. రూ. 7,700 కోట్లు పంపిణీ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ప్రపంచాన్ని తలదన్నేలా నిర్మాణాలను చేపడుతోంది. అలాగే తెలంగాణలోని పల్లెల్లోనూ అలాంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు వేసింది. ఇకపై ప్రతి మండలానికి రెండు గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఓ వైపు విశ్వ నగరం హైదరాబాద్ ను అన్ని వైపులా అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో రెండో దశ, ఆర్ఆర్ఆర్ నిర్మాణాలు, హైడ్రా.. తదితర నిర్ణయాలతో హైదరాబాద్ ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు రేవంత్ సర్కార్ కృషి చేస్తోంది. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాలనూ అదేవిధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు గ్రామ పంచాయతీ భవనాలు, రెండు అంగన్వాడీ కేంద్రాల నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. *మంత్రి సీతక్క పర్యవేక్షణ* మంత్రి సీతక్క దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాదే రాష్ట్రంలో 1148 అంగన్ వాడీ భవనాలు,1144 గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక ఈ ఏడాది రాష్ట్రంలో కొత్తగా 1148 అంగన్వాడీ భవనాలను నిర్మించనుంది ప్రభుత్వం. అయితే ఈ నిర్మాణానికి ఇప్పటికే 813 స్థలాలను అధికారులు గుర్తించారు. మిగిలిన చోట్ల స్థలాల గుర్తింపు పెండింగ్ లో ఉంది. ఇక ఇదే ఏడాది రాష్ట్రంలో 1144 గ్రామ పంచాయతీ భవనాలను పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 549 గ్రామాల్లో స్థలాలను అధికారులు గుర్తించారు. మరో 84 చోట్ల భూసేకరణ జరుగుతోందని.. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.
.
Aksharam Telugu Daily